పైసలిస్తేనే పనులు చేసే తహసీల్దార్ సస్పెన్షన్

తహసీల్దార్ కార్యాలయంలో చేయాల్సిన పనుల కోసం దళారులను ఏర్పరచుకొని డబ్బులు ఇస్తేనే పనులు చేసిన అవినీతి ఆరోపణల కేసులో నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్ గురువారం సస్పెండ్​ అయ్యారు.

Update: 2024-08-29 10:43 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : తహసీల్దార్ కార్యాలయంలో చేయాల్సిన పనుల కోసం దళారులను ఏర్పరచుకొని డబ్బులు ఇస్తేనే పనులు చేసిన అవినీతి ఆరోపణల కేసులో నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్ గురువారం సస్పెండ్​ అయ్యారు. గత శుక్రవారం నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల రైతులు తహసీల్దార్ లక్ష్మణ్ డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

    ఈ విషయం దినపత్రికలలో రావడంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లక్ష్మణ్ పై విచారణ చేపట్టాలని ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్ ను ఆదేశించారు. దీంతో ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ నాగిరెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దారు లక్ష్మణ్ తో పాటు అవినీతి ఆరోపణలు చేసిన రైతులను విచారణ చేపట్టి నివేదికలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. తహసీల్దార్ లక్ష్మణ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడంతో జిల్లా కలెక్టర్ నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్ ను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags:    

Similar News