Sugar Factory : షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ప్రారంభం..

నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ పరిధిలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారంలో సోమవారం వైస్ ప్రెసిడెంట్ టి.వేణుగోపాలరావు, జీఎం.వెంగల్ రెడ్డి చెరుకు క్రషింగ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి క్రషింగ్ ప్రారంభించారు.

Update: 2024-11-04 09:18 GMT

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ పరిధిలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారంలో సోమవారం వైస్ ప్రెసిడెంట్ టి.వేణుగోపాలరావు, జీఎం.వెంగల్ రెడ్డి చెరుకు క్రషింగ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి క్రషింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 - 25 సీజన్ కు గాను సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ ను నిర్వహించే లక్ష్యంతో ప్రణాళికలను సిద్ధం చేశామని ఆయన తెలిపారు. రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వారు పేర్కొన్నారు.

నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న 15 మండలాల నుండి నిజాంసాగర్, బాన్సువాడ, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కోడబ్గల్, కల్హేర్, సిర్గాపూర్, మానూర్, నారాయణఖేడ్, నాగలిగిద్ద, కాగ్టి, నిజాంపేట్, శంకరంపేట్, మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్, మెదక్ జిల్లాలోని నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ నుండి మాగి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారంకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల దగ్గర నుండి ఇప్పటికే 3,200 హెక్టర్ల చెరుకు పంటను యజమాన్యం అగ్రిమెంట్ కుదిరించుకుందని ఆయన అన్నారు. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో రోజుకు 3,500 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో కర్మాగారాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఎండి.షాదుల్లా, అనిత సింగ్, భాస్కర్ రెడ్డి, రాజబాబు, సుబ్బారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, సుగుణభూషణ్ రావు, శ్రీనివాస్, చంద్రశేఖర్, సత్యనారాయణ, ఏలే.ప్రవీణ్ కుమార్, వెంకట్ రెడ్డి, పవన్ కార్మికులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News