పట్టుబట్టి గెలిచిన సుదర్శన్ రెడ్డి

తన రాజకీయ చతురత ఉపయోగించి కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ ఆమెర్ పై ఘన విజయం సాధించారు.

Update: 2023-12-03 10:25 GMT

దిశ, బోధన్ : తన రాజకీయ చతురత ఉపయోగించి కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ ఆమెర్ పై ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన లెక్కింపులో మొదట్లో సుదర్శన్ రెడ్డి ముందంజలో ఉన్నప్పటికి తరువాత 4 వ రౌండ్ బోధన్ అర్బన్ నుండి షకీల్ కు లీడ్ రాగా తరువాత రెంజల్, నవీపేట్, ఎడపల్లి మండలాల్లో కాంగ్రెస్ కు స్వల్ప మెజారిటీ రావడంతో కాంగ్రెస్ విజయం లాంఛనమైనది.

సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు...

ఉత్కంఠ భరితంగా సాగిన లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి విజయం సాధించడంతో బోధన్, రెంజల్, నవీపేట్, ఎడపల్లి మండలాల్లో కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు మిఠాయిలు పంచుతూ, బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.


Similar News