అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్​ అధికారులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-01-02 14:34 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్​ అధికారులు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్మూర్ హౌజింగ్ బోర్డు గణేష్ నగర్ కాలనీలో గల మున్సిపల్ పది శాతం స్థలాన్ని బీజేపీ నాయకులు, కాలనీ వాసులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. మున్సిపల్ 10 శాతం స్థలాలను కొందరు మున్సిపల్ పాలకులే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నందున వాటిలో

    చిల్డ్రన్స్ పార్క్ లు ఏర్పాటు చేయాలని కమిషనర్ ప్రసాద్ చౌహాన్, టీపీవో హరీష్ లకు సూచించారు. కాగా హౌజింగ్ బోర్డ్ గణేష్ కాలనీ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి మున్సిపల్ 10 శాతం స్థలాల్లో మొక్కలు పెంచి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి పార్కు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, నాయకులు యామాద్రి భాస్కర్, పాలెపు రాజు, దోండి ప్రకాష్, డమాంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. 

Similar News