ఆపదలో ఆపన్న హస్తం

అనారోగ్యానికి గురైన పూర్వ విద్యార్థికి పూర్వ విద్యార్థులు ఆపన్న హస్తం అందించారు.

Update: 2024-10-03 10:19 GMT

దిశ ఆర్మూర్ : అనారోగ్యానికి గురైన పూర్వ విద్యార్థికి పూర్వ విద్యార్థులు ఆపన్న హస్తం అందించారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెరికిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు కొందరు కలిసి వారి బ్యాచ్ పూర్వ విద్యార్థిని జమున నాగరాజ్ కు 44500 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఆ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని జమున కొన్ని నెలల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో.. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పూర్వ విద్యార్థులు కొందరు కలిసి ఆర్థిక సాయం అందించాలని ఆలోచన చేసి ఆచరణలో పెట్టారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ..మా తోటి పూర్వ విద్యార్థిని అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని పూర్వ విద్యార్థులందరూ నిర్ణయించుకొని ఆమెకు ఆర్థిక సాయం అందించమన్నారు. భవిష్యత్తులో మా తోటి విద్యార్థిని జమునకు ఆరోగ్య రిత్య అవసరమైతే మరింత సాయం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంతోషమ్మ, రజిత, కల్పన, భోజ లత, వైదేహి, లక్ష్మీనారాయణ, అశోక్, భాస్కర్, మోహన్, భూమేశ్వర్, సృజన్, నరహరి, రవి, నరేష్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News