తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలవటం గర్వకారణం..

బాల్కొండ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు.

Update: 2023-03-06 14:49 GMT

దిశ, భీమ్‌గల్ : బాల్కొండ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు దేశానికే గర్వకారణమని అన్నారు. శాంతి భద్రతలకు తెలంగాణ నిలయం అని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష, ఆయన మేధో మథనం వల్ల తెలంగాణ దేశంలో అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు పోలిస్టేషన్ లలో గడిపాను, కొన్ని వందల సార్లు ఉద్యమకారునిగా పొలిస్టేషన్ కు వచ్చారు. కానీ దేశంలో ఉన్న గొప్ప ప్రజాస్వామ్యం వల్ల మంత్రిగా ప్రారంభానికి రావటం గర్వకారణంగా ఉందన్నారు.

శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ఉద్యమన్ని నడిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. హింసాత్మక ఘటనలవైపు వెళ్లకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య పక్షన్నే పోరాటం చేయటం వల్ల ఈరోజు ఈ ఔన్నత్యం దక్కిందన్నారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ వచ్చాక పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. పోలీసులపై సమాజంలో గౌరవం కూడా పెరిగింది. గతంలో పోలిష్టేషన్ లకు కనీసం స్టేషనరీకి కూడా నిధులు లేని పరిస్థితి. పోలీసులు ప్రయాణించే వాహనాలు దారుణంగా ఉండేవి, కనీసం పెట్రోల్ డీజిల్ కు నిధులు లేని పరిస్థితి, కానీ ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ అవసరాలు ఏంటో తెలిసిన సీఎం ప్రతి నెల పోలీసు స్టేషన్ కు నిధులు ఇస్తున్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ గా నిలుస్తున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు ఇక్కడికి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం.

ఎక్కడైనా పరిశ్రమలు రావాలన్న, ఐటి అభివృద్ధి చెందేలా, లా అండ్ ఆర్డర్ బాగుండాలి ప్రశాంత వంతమైన వాతావరణం కల్పిస్తెనే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. నిరంతర విద్యుత్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఈ మూడు అంశాలపై మేఘోమదనం చేసి సక్సెస్ అయ్యామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్ష, ఆయన కష్టం వల్లనే తెలంగాణకు మేలుజరుగుతుంది. పంట పొలాలు పచ్చగా కళకళాడుతూన్నాయని అన్నారు. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయన్ని పల్లెప్రగతి కోసం ఖర్చు చేస్తున్నం. 950 కోట్ల రూపాయలు కేవలం మహిళల సంక్షేమం కోసం మా బాల్కొండ నియోజకవర్గంలో ఖర్చుచేసమని అన్నారు.

అనంతరం హోం మంత్రి మహమూద్ అలి మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ గా నిలవటం గర్వకారణమని అన్నారు. అర్బన్ ఏరియాలో 75 వేల రూపాయలు నెలకు ఒక్కో పాలిస్టేషన్ కు, రూరల్ లో 15 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇది దేశంలో ఎక్కడ లేదన్నారు. ముఖ్యమంత్రి విజన్ చాలా గొప్పది. 33 జిల్లాల ఏర్పాటు ద్వారా పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ మార్గనిర్దేశంగా నిలుస్తుంది. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చేవారు. ఇక్కడి అభివృద్ధినీ చూసి ఆశ్చర్యపోతున్నరు. ఇక్కడి రైతులను లక్షాధికారులను చేసిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి సెక్రిటీ భవనాన్ని కూడా అత్యాధునిక హంగులలతో నిర్మిస్తున్నాం. దీని వెనుక మంత్రి వేముల కృషి ఎంతో ఉన్నదని అన్నారు.

2014కి ముందు పోలీసుల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 9598 కోట్లను వెచ్చించి పోలీస్ స్టేషన్ లను అదునికరించమన్నారు. పోలీసులకు నూతన ఆధునిక వాహనాలను అందించామన్నారు. పోలీస్ శాఖలో 33 శాతం మహిళా రిజర్వేషన్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. ప్రతి ఇంటికి తాగు నీరు అందిచకుంటే ఓటు అడగను అని దైర్యంగా చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్పనాయకుడు మన ముఖ్యమంత్రి అని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోలీసులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News