భీమ్గల్‌లో ఘనంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. అశేషంగా తరలివచ్చిన భక్త జనం

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీ నృసింహుని కార్తీకమాస బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.

Update: 2023-11-28 14:29 GMT

దిశ, ఆర్మూర్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీ నృసింహుని కార్తీకమాస బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజైనా మంగళవారం పుష్పయాగం అనంతరం ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానితులైన సకల దేవతలకు మంత్రోచ్చరణచే ఉద్వాసన చేశారు. తదుపరి ధ్వజ అవరోహణము చేసి ఉద్వాసన బలి ప్రధాన మోనరించి ఈశాన్య బలిని(కొండబలి) ఒసంగెదరు. శ్రీ లక్ష్మీ నృసింహ ఉత్సవ విగ్రహాలను పల్లకిలో తీసుకొచ్చి సమస్త భక్త జనుల మధ్య లాలి పాటలు పాడుతూ డోల సేవ నిర్వహించారు. డోల సేవతో ఉత్సవాలు ముగిశాయి. అనంతరం కొండపై నుండి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా గుర్రపు సేవపై అలంకరించి పట్టణంలోని గ్రామాలయమునకు ఎదుర్కొలు గా తెచ్చారు. గ్రామాలయంలో స్వామికి సప్తావరుణ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Similar News