చంద్రయన్ 3 విజయవంతం కావాలని ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల దార్ల హనుమాన్ ఆలయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ (3) యాత్ర కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Update: 2023-08-23 09:23 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల దార్ల హనుమాన్ ఆలయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ (3) యాత్ర కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సం దర్భంగా మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ రెడ్డి బాబురావు మాట్లాడుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ (3) కార్యక్రమం విజయవంతం అయితే చంద్రుడిపై భారత మువ్వన్నెల జెండా ఎగిరి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర వనీ శాసన సభ్యులు సంజీవరెడ్డి బాబురావు, బీజేపీ ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News