అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల కల్పనకు కృషి

నియోజకవర్గ పరిధిలోని దాదాపు 59 అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు సరిగ్గా లేవని, ఆయా కేంద్రాల్లో సరియైన వసతుల కల్పన కు కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-10-23 14:06 GMT

దిశ, కామారెడ్డి : నియోజకవర్గ పరిధిలోని దాదాపు 59 అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు సరిగ్గా లేవని, ఆయా కేంద్రాల్లో సరియైన వసతుల కల్పన కు కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మహిళా, శిశు సక్షేమశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించే బాధ్యత అంగన్వాడీలదేనని గుర్తు చేశారు. మహిళలు, పిల్లల హక్కులు కాపాడడంలో.. ఎలాంటి తప్పిదాలకు తావివ్వద్దని సూచించారు. అధికారులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మెప్మా అధికారులు, ఆర్పీలు, డీఆర్ డీ వో అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు.


Similar News