ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ తొలగించాలని ఫిర్యాదు
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ తొలగించాలంటూ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
దిశ ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ తొలగించాలంటూ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. మహాలక్ష్మి కాలనీలో బాలాజీ అపార్ట్మెంట్ కు ముందు భాగంలో నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ లను తొలగించాలని కాలనీవాసులు బుధవారం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజు విద్యుత్ శాఖ డి నాగేశ్వరరావు లకు మహాలక్ష్మి కాలనీవాసులు ఫిర్యాదు చేసి వాటిని తొలగించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో కాలనీవాసులు సత్యం, తిరుపతి, రఫీ యుద్దీన్ తదితరులు ఉన్నారు.