SP Sindhu Sharma : కామారెడ్డి జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు

జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా

Update: 2024-11-01 07:51 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నవంబర్ 1 నుంచి 7 వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యాక్టు అమలు లో ఉంటుందన్నారు. ఈ యాక్టు ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు.


Similar News