కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌనదీక్ష..
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్ట్ పరువునష్టం కేసులో రెండేళ్ల జైల్ శిక్ష వేసిన విషయం తెలిసిందే.
దిశ, నిజామాబాద్ సిటీ : 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సభలో మోడీ గురించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్ట్ పరువునష్టం కేసులో రెండేళ్ల జైల్ శిక్ష వేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కారణంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కాంగ్రెస్ భవన్ వద్ద మౌనదీక్ష చేశారు. అనంతరం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీయాదవ్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేశారు.
ఈ సందర్భంగా నగరకాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు మాట్లాడుతూ కోర్టు తీర్పు పై మాకు నమ్మకం ఉందని, ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలలో అధికారపక్షం, ప్రతిపక్షం ఇతర పార్టీలు ఒకరి పై ఒకరు ఎన్నో మాటలు అనుకుంటారని, వాక్ స్వాతంత్రం ఎవరికైనా ఉందని, దానిని బీజీపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ మాటలను సీరియస్ గా తీసుకొని కేసుపెట్టడం సరైనది కాదన్నారు. గతంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ నాయకుల పరువుకు భంగం కలిగించేలా ఎన్నో మాటలు మాట్లాడిందని, కానీ వారిపై కేసులు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని అన్నారు. ఇలా కేసులు పెడుతూ బీజేపీ ప్రభుత్వం నూతన సంప్రదాయానికి తెరలేపుతుందని అన్నారు. వెంటనే బీజేపీ రాహుల్ గాంధీ పై వేసిన కేసును బేషరతుగా వాపసు తీసుకోవాలని కేశవేణు డిమాండ్ చేశారు.
2019 కర్ణాటకలో రాహుల్ గాంధీ మోడీ అని ఇంటి పేరు ఉన్న వ్యక్తులు దేశ దొంగలు అని లలిత్ మోడీ నిరవ్ మోడీని ఉద్దేశించి సందేహం వ్యక్తం చేశారు తప్ప అందరినీ అని రాహుల్ గాంధీ అనలేదని అన్నారు. కేవలం గుమ్మడి కాయల దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు బిజేపీ గుజరాత్ మాజీ మంత్రి పూర్ణష్ మోడీ రాహుల్ గాంధీ పై కేసువేయడం సరికాదని అన్నారు. అధికారం కోల్పోయే భయంతోనే తప్పుడు కేసులు వేస్తున్నారు తప్ప మేము కేసులకు భయపడేది లేదని, మేము సవర్కార్ వాసులం కాదు గాంధీ వారసులం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్, 38వ డివిజన్ కార్పొరేటర్ రోహిత్, పీసీసీ మాజీ మెంబర్ ఈసా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్, అబుద్ బిన్ హందాన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మలైక బేగం, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం, నగర మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఏజాజ్, జిల్లా సేవదల్ అధ్యక్షుడు సంతోష్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు రేవతి, జాహెద్ బిన్ హందాన్, డీసీసీ డెలిగెట్ ప్రమోద్, అవిన్, స్వామి గౌడ్, దత్తు, ముదాషిర్, ముస్తాఫ్ఫా, వాహిద్, మోయిన్, అజీజ్ అన్సారి తదితరులు పాల్గొన్నారు.