Shabbir Ali: షబ్బీర్ అలీ కాన్వాయ్‌లో ఢీకొన్న కార్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్న ఘటన పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో బుధవారం చోటు‌చేసుకుంది.

Update: 2024-09-04 06:48 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్న ఘటన పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో బుధవారం చోటు‌చేసుకుంది. నిజామాబాద్ అర్బన్ జిల్లా ఇంచార్జిగా ఉన్న ఆయన పర్యటనలో భాగంగా ఇవాళ నిజామాబాద్ పట్టణానికి వచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ముందు ఆయన కాన్వాయ్‌లోని కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 కార్లు స్వల్పంగా దెబ్బతినడం మినహా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


Similar News