షబ్బీర్ అలీ బర్త్ డే విషెస్ ఫ్లెక్సీల చించివేత

ఫుల్‌గా మందు కొట్టి.... పెళ్లి భరత్‌లో పాల్గొని నృత్యాలు చేస్తూ... ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తాగిన మైకంలో చించివేశారు.

Update: 2024-02-15 14:24 GMT

దిశ, భిక్కనూరు: ఫుల్‌గా మందు కొట్టి.... పెళ్లి భరత్‌లో పాల్గొని నృత్యాలు చేస్తూ... ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తాగిన మైకంలో చించివేశారు. ఈ ఘటన కామారెడ్డి రెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన ఒక ఇంట్లో పెళ్లి జరగడంతో, రాత్రి భరత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫుల్లుగా మద్యం కొట్టిన కొందరు యువకులు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో గురువారం షబ్బీర్ అలీ బర్త్‌డేను పురస్కరించుకొని విషెస్ తెలుపుతూ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నృత్యాలు చేస్తూ, కొందరు బీ‌ఆర్‌ఎస్ యువకులు చించి వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల చించివేతకు సంబంధించి సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో, సీసీ ఫుటేజ్ ఆధారంగా సదరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే తాగిన మైకంలో పొరపాటు చేశారని, కేసును విత్ డ్రా చేసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ఒకరు కాంగ్రెస్ నాయకుల వద్దకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం.


Similar News