Sanitation : ప్రధాన రోడ్లపైనే మురుగునీరు

అస్తవ్యస్త ప్రధాన రోడ్లపైనే మురుగునీరు పారుతోంది.

Update: 2024-10-28 14:29 GMT

దిశ ఆర్మూర్ : అస్తవ్యస్త ప్రధాన రోడ్లపైనే మురుగునీరు పారుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని దుస్థితి ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోనిబకోటార్ మూర్ నెలకొని ఉంది. 63 వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన ఫిష్ మార్కెట్ ప్రక్కన రోడ్డులో వర్షాకాలం ముగిసి నెలవుతున్న.. డ్రైనేజీలు నిండుకోవడంతో మురుగంత రోడ్డుపైనే పారుతుంది. ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపైన మురుగుపారడంతో ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే స్థానికులకు దుర్వాసన రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డు ప్రక్కన డ్రైనేజీల ప్రక్కన ఏపుగా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాటు.. డ్రైనేజీలు వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. దీంతో మురుగు నీరంతా రోడ్డుపైనే పారుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆరో శివారు లో గల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న.. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News