ఆర్మూర్లో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయండి
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఢిల్లీ లో పలువురు కేంద్ర మంత్రులను బుధవారం కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ పట్టణ కేంద్రంలో సైనిక్ స్కూల్ కోసం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఢిల్లీ లో పలువురు కేంద్ర మంత్రులను బుధవారం కలిశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మున్సిపల్ పట్టణ కేంద్రంలో సైనిక్ స్కూల్ కోసం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. ఆర్మూర్ లో సైనిక్ పాఠశాల అవసరం పై పైడి రాకేష్ రెడ్డి మంత్రికి వివరించగా కేంద్రమంత్రి సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం సానుకూలంగా స్పందించారు. అనంతరం కేంద్రం గ్రామీణ ప్రాంతాల
కోసం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పథకం ద్వారా నిధులు రాష్ట్రానికి ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేంద్రం ఇచ్చినా వాటిని సరైన విధంగా ఉపయోగించడం లేదని మంత్రికి వివరించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, అదిలాబాద్ ఎమ్మెల్యే పయల్ శంకర్, పాల్వాయి హరీష్ తదితరులు ఉన్నారు.