రెండో విడత నీరు విడుదల
ఆయకట్టు కింద సాగు చేస్తున్న ఖరీఫ్ పంట సాగు కోసం రెండో విడత నీటిని విడుదలను గురువారం ఉదయం ప్రారంభించినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు.
దిశ,నిజాంసాగర్ : ఆయకట్టు కింద సాగు చేస్తున్న ఖరీఫ్ పంట సాగు కోసం రెండో విడత నీటిని విడుదలను గురువారం ఉదయం ప్రారంభించినట్లు నీటిపారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్ష 15 వేల ఎకరాల ఆయకట్టుకు మొదటి విడతలో 1.2 టీఎంసీల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రెండో విడత నీటిని విడుదలను ప్రారంభించామన్నారు.
ఆయకట్టు పంటల కోసం రైతులు అవసరాలకు నీటి విడుదలలో మార్పులు ఉండవచ్చని అన్నారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో నుంచి ఎలాంటి వరద నీరు రావడం లేదన్నారు. ప్రాజెక్టులో నీరు తక్కువ ఉండడంతో రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1405 అడుగులకుగాను 1391.80 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను 4.875 టీఎంసీల నీరు ఉన్నట్టు తెలిపారు.