11న ఆర్మూర్ లో సప్త హారతి గిరి ప్రదక్షణ

ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయం సిద్దుల గుట్టపై నుంచి ఈనెల 11న సప్త హారతి గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Update: 2023-12-06 13:33 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయం సిద్దుల గుట్టపై నుంచి ఈనెల 11న సప్త హారతి గిరి ప్రదక్షణ నిర్వహిస్తున్నట్లు నవనాథ సిద్దేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షణ లో రథోత్సవం పై సిద్దేశ్వరుడు, సీతారామ లక్ష్మణ ఆంజనేయులు, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపుగా సిద్దుల గుట్ట చుట్టూ రథోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. సిద్దుల గుట్ట నుంచి ప్రారంభమయ్యే రథోత్సవం ఆలూరు రోడ్డు, కాశి హనుమాన్, జండా గుడి, ముదిరాజ్ సంఘం, గోల్ బంగ్లా, జంబి హనుమాన్, అంబేద్కర్ చౌరస్తా వద్ద హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ గిరిప్రదక్షణలో మహిళలు మంగళ హారతులతో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పారు. ఆర్మూర్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలలోని భక్తులు గిరి ప్రదక్షణలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Similar News