రూ.4 వేల జీవనభృతి ఇవ్వాలి

బీడీ కార్మికులకు రూ.4 వేల జీవనభృతి ఇవ్వాలని కార్మికులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.

Update: 2024-08-30 09:38 GMT

దిశ, వేల్పూర్ : బీడీ కార్మికులకు రూ.4 వేల జీవనభృతి ఇవ్వాలని కార్మికులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రం లోని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా రూ. 4వేల జీవన భృతిని అమలు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్​ కు వినతిప్రతం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని, ఇందులో 98 శాతం మంది బీడీలు చుట్టే కార్మికులు ఉన్నారని తెలిపారు. ఇతర పరిశ్రమల కార్మికుల కంటే బీడీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయని, అంతేకాకుండా ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ చేతినిండా పని లేదని తెలిపారు.

     సగం రోజులకు మాత్రమే పని దొరుకుతుందని, ఈ పరిస్థితులలో 2023 నవంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ చేయూత పథకం కింద నాలుగు వేల రూపాయలను ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని అమలు చేయాలని కోరారు. ఈరోజు వేల్పూర్ మండల పరిధిలోని గ్రామాల కార్మికులు సుమారు 500 మందితో ధర్నా చేసి వినతిప్రతం అందించారు. ఈ ధర్నాకు యూనియన్ జిల్లా నాయకులు జి.అరవింద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.సత్తెమ్మ, జిల్లా నాయకులు కె.రాజేశ్వర్, ఎండీ.నజీర్, పి.రూపేష్, బీడీ కమిషన్దారులు, పెద్ద ఎత్తున బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News