భారీ వర్షాలతో తెగిన రోడ్లు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న

Update: 2024-09-02 04:49 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లు, కల్వర్టులు ధ్వంసం అవుతున్నాయి. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడికి అక్కడ రాకపోకలు స్తంభిస్తున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ - అమీర్ నగర్ గ్రామాల మధ్య రహదారి అడ్డంగా తెగిపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో వరి పంటలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.


Similar News