ఆలూర్‌లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
ఆలూర్ మండలం కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో చైర్మన్ తంబూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తంబూరి శ్రీనివాస్ మాట్లాడుతూ దళారులకు పంటను అమ్మి మోసపోవద్దని,ప్రభుత్వం రైతులకు మద్దతు ధర వరికి సన్నకు రూ.2,300, దొడ్లకు రూ.2,320 రూపాయలు, అలాగే ప్రభుత్వం కేటాయించిన 33 రకాల సన్నాలకు రూ.500 బోనస్ అదనంగా పొందాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, వీడీసీ అధ్యక్షుడు బార్ల ముత్తం, సహకార సంఘం వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ సంఘం డైరెక్టర్లు బార్ల సంతోష్ రెడ్డి ,కళ్ళెం సాయ రెడ్డి ఇంగు గోవర్ధన్ ,కళ్ళెం బొజ రెడ్డి సింగేడి మల్లు బాయి,అరే రాజేశ్వర్ ,గొల్ల గంగాధర్ ,వెల్మ నర్సరెడ్డి, కట్ట నర్సయ్య ,ప్రమోదు కుమార్,పచ్చుక లస్ము బాయి సంఘం కార్యదర్శి తొర్తి మల్లేష్ ,సిబ్బంది ముత్యం,దేవరాజు , గంగాధర్,రాజు ,గంగారం రైతులు పాల్గొన్నారు.