11 నుంచి జిల్లాలో రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర ఖరారు అయిందని జిల్లాల అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర ఖరారు అయిందని జిల్లాల అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా మీదుగా ఈ నెల11న రాత్రి బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లి చేరుకుని అక్కడే బస చేసి 12న ఉదయం 9:00 గంటలకు భీంగల్ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని కమ్మర్ పల్లిలో రైతులతో సమావేశంతో అవుతారు. 13 న ఉదయం 8:00 గంటల నుండి పాదయాత్ర కమ్మర్పల్లి నుండి ఉప్లూర్ వరకు సాగుతుంది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 13 రాత్రి 9:00 గంటలకు మోపాల్ చేరుకుని అక్కడే బస చేస్తారు. 14న ఉదయం మంచిప్ప రిజర్వాయర్ సందర్శిస్తారు. 14న రాత్రి నిజామాబాద్ నగరానికి చెరుకోని అక్కడే బసచేస్తారు. 15 న ఉదయం దుబ్బఅండర్ గ్రౌండ్ డ్రైనేజ్ , సెవెజ్ ట్రిట్ మేంట్ ప్లాంట్ సందర్శిస్తారు. అసంపుర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్థల పరిశీలన చేస్తారు. సాయంత్రం నగరంలో పాదయాత్ర చేస్తారు. 15న రాత్రి బోధన్ నియోజకవర్గంలోని షాటాపూర్ గేట్ చేరుకొని అక్కడే బస చేస్తారు.
16న ఉదయం సారంగాపూర్ వద్ద ప్రాణహిత-చేవెళ్ల పంపు హౌస్ సందర్శన, నవీపేట్ గ్రామంలో మార్కండేయ ఆలయ సందర్శన, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గోంటారు. 16న రాత్రి 9:00 గంటలకు ఆర్మూర్ నియోజకవర్గంలోని పెర్కిట్ చేరుకుని పెర్కిట్ హైవే పక్కన బస చేస్తారు. 17న ఉదయం 9:00 గంటలకు సిద్దుల గుట్ట ఆలయ సందర్శన, సాయంత్రం పాదయాత్ర పెర్కిట్ నుండి మామిడిపల్లి, ఆర్మూర్ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.