రబీ పంటల సాగుకు నీటి విడుదల

ఉమ్మడి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద రబీ సీజన్ కు గాను మూడవ విడతగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ ద్వారా గురువారం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు.

Update: 2024-01-11 14:02 GMT

దిశ,నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద రబీ సీజన్ కు గాను మూడవ విడతగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువ ద్వారా గురువారం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్ష 15 వేల 825 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సాగునీటిని రైతులు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు. మూడవ విడత పది రోజులపాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను 13.646 టీఎంసీల నీరు ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వ ఉందని తెలిపారు.  


Similar News