డిగ్రీలు కాదు జ్ఞానాన్ని పొందడమే అసలైన విద్య

కష్టపడి చదువుకొని డిగ్రీ పట్టాలు పొందడం కాదని, జ్ఞానాన్ని పొందడమే అసలైన విద్య అని, అప్పుడే తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకానికి ప్రయోజనం చేకూరినట్లవుతుందని కర్ణాటక రాష్ట్ర సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి బట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు.

Update: 2024-02-08 16:16 GMT

దిశ, భిక్కనూరు : కష్టపడి చదువుకొని డిగ్రీ పట్టాలు పొందడం కాదని, జ్ఞానాన్ని పొందడమే అసలైన విద్య అని, అప్పుడే తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకానికి ప్రయోజనం చేకూరినట్లవుతుందని కర్ణాటక రాష్ట్ర సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి బట్టు సత్యనారాయణ ఆకాంక్షించారు. గురువారం భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా లో ఉన్న సౌత్ క్యాంపస్ లో ని సెమినార్ హాల్లో జరిగిన ఉన్నత విద్య- ఉపాధి అవకాశాలు అనే సదస్సు లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయాలు విద్యను అందించడమే కాకుండా సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మార్గం చూపే వేదికలుగా దోహదపడాలన్నారు.

     క్యాంపస్ లో చేరిన విద్యార్థిని విద్యార్థులకు రెండు సంవత్సరాలు బంగారం లాంటి అవకాశం దక్కిందని, ఆ అవకాశాన్ని క్యాంపస్ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, బయటకు వెళ్లాక జీవితంలో ఎలా బతకాలో ఇక్కడే నేర్చుకుంటారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి గమ్యంతో ముందుకు వెళ్లాలని, దాన్ని సాధించడానికి ఏ మాత్రం నిరుత్సాహపడకుండా పట్టుదలతో సాధించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఉద్యోగాలు చేసే స్థాయిని దాటి ఉద్యోగాలు సొంతంగా ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. యూజీసీ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల కోసం అనేక కొత్త విధానాలను ఆవిష్కృతం చేసిందని,

    దాంట్లో ఎం ఓ ఓ సీ ఎస్ స్వయం అనేది ఒక ఉదాహరణగా అన్నారు. 2020 నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా బహుళ క్రమశిక్షణ రూపకల్పన జరుగుతుందని, 2047 వరకు వికసితభారత్ గా అభివృద్ధి చెందాలన్నారు. కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత భారతీయ శాస్త్రవేత్తలదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, అదే భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పతనమన్నా రు. ముద్ర రుణం వంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతూ, ఇతరులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.

     ప్రొఫెసర్ యాదగిరి, క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేశ్వరి, కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, డాక్టర్ లలిత, హరిత, మోహన్ బాబు, అంజయ్య, వీరభద్రం, ప్రతిజ్ఞ, కవిత, హాస్టల్ వార్డెన్ లు డాక్టర్ యాలాద్రి, సునీత, ఎస్.నారాయణ గుప్తా, రాహుల్ వంగ, డాక్టర్ సరిత, రమాదేవి, నిరంజన్, ఉమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి, నర్సయ్య, శ్రీకాంత్, ఇంద్రకరణ్, శ్రీకాంత్, కనకయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News