విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ తెలిపారు
దిశ ,కమ్మర్ పల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యం వహించరాదని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం సందర్శించారు. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజన వంటలను పరిశీలించారు. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులను మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు భోజనం వడ్డించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాసం శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.