నిజామాబాద్ లో పొట్టేలు సినిమా యూనిట్ సందడి..

నిజామాబాద్ నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో పొట్టేలు సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది.

Update: 2024-10-23 08:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని నిశిత డిగ్రీ కళాశాలలో పొట్టేలు సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో యువచంద్ర, హీరోయిన్ అనన్య నాగళ్ల కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తమ సినిమాను ఆదరించాలని, అందరికీ నచ్చే విధంగా సినిమాను రూపొందించారని హీరో హీరోయిన్లు అన్నారు. నిజామాబాద్ నగరం అంటే తమకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రజలు చాలా మంచి వారని, కొత్త నటీనటులను కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటారని వారన్నారు. స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు నటులు ఓపిగ్గా సమాధానమిచ్చారు. చాలా స్నేహపూర్వకంగా వారితో మాట్లాడి అలరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్, నటీనటులను సన్మానించారు.


Similar News