ప్రశ్నాపత్రాలు రాకపోవడంతో ఎగ్జామ్ వాయిదా

తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం జరగాల్సిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Update: 2023-05-02 05:45 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం జరగాల్సిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలుగు మీడియం ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరకపోవడంతో వాయిదా వేయాలని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నేడు జరగాల్సిన ఎకనామిక్స్ తెలుగు మీడియం పేపర్ పరీక్ష వాయిదా వేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలియజేశారు. ప్రశ్న పత్రాలు రాక పరీక్ష వాయిదా విషయం తెలియక విద్యార్థులందరూ పరీక్ష కేంద్రాలకు వచ్చారు.

చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పిల్లలను ఇంటికి పంపించారు. మరో రెండు రోజుల్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు ముగియాల్సి ఉండగా ప్రశ్నాపత్రాలు జిల్లాలకు చేరకపోవడంతో పరీక్షలు వాయిదా వేయడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నాపత్రాలు ముద్రితమైన తర్వాత, జిల్లాలకు పంపించిన తర్వాతనే జరిగే పరీక్షలను ప్రశ్నాపత్రాలు రాలేదని సాకుతో వాయిదా వేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాయిదా ప్రకటన చేశారని చెప్పడం గమనార్హం.

Tags:    

Similar News