పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే

Update: 2024-03-03 12:40 GMT

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. తల్లిదండ్రులు తమ భాద్యతగా 0-5 సంవత్సరం లోపు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలను వేయాలని కోరారు.

పోలియో మహమ్మారిని తరిమికొట్టాలంటే పోలియో చుక్కలు నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. అందుకు గాను పోలియో చుక్కల కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధిగా పోలియో చుక్కలను వేసి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటిసి చికోటి జయప్రదీప్,మాజీ వైస్ ఎంపిపి మల్లికార్జున్,గౌస్ పటేల్,లక్ష్మా రెడ్డి,వైద్యాధికారి రోహిత్ కుమార్,వైద్య సిబ్బంది సాలోమని, సాయిలు, ఈశ్వర్, సిద్ధిరామేశ్వరరావు, మధు, వెంకట్ నారాయణ,అంగన్వాడీ కార్యకర్త ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Similar News