పోచారం గేట్లు ఎత్తనున్న అధికారులు..

పోచారం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద భారీగా రావడంతో ప్రాజెక్టులు నీటిమట్టం పెరిగింది.

Update: 2024-09-01 10:37 GMT

దిశ, ఎల్లారెడ్డి : పోచారం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద భారీగా రావడంతో ప్రాజెక్టులు నీటిమట్టం పెరిగింది. దీంతో నీటిని కిందికి వదలడానికి నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నట్లు నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు గేట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎత్తనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పోచారం ప్రాజెక్టు నీటిమట్టం, 1.820, టీఎంసీలు కాగా, ప్రస్తుతం, 1.423, టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఎగువ నుండి వరద 20,280 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని, ప్రాజెక్టు నీటిమట్టానికి మించి వరద రావడంతో ఆదివారం పోచారం ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నామని నీటిపారుదల శాఖ డిప్యూటీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. కావున ఆయకట్టు కింద ఉన్న, మాల్ తుమ్మెద, నాగిరెడ్డిపేట, బంజర, వెంకంపల్లి, మాటూర్, జలాల్పూర్, ఆత్మకూర్, రుద్రారం, మతమాల, గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ తెలిపారు.


Similar News