సర్వేపై నగర ప్రజలు అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దు

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ నగరంలో బుధవారం ప్రారంభమైందని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు.

Update: 2024-11-06 16:11 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 06: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ నగరంలో బుధవారం ప్రారంభమైందని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తె లిపారు. సర్వే పై నగర ప్రజలు ఎలాంటి అనుమానాలు,అపోహలు పెట్టుకోకుండా సమగ్ర కుటంబ సర్వేకు సహకరించాలని , సర్వే ను విజయవంతం చేయాలని కోరారు. నగరంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై కమిషనర్ దిశ తో ముచ్చటించారు. మున్సిపల్ పరిధిలోని 60 డివిజన్లలో సర్వే కోసం 725 ఎన్యూమరేషన్ బ్లాక్ లుగా విభజించి, 725 మంది ఎన్యూమరేటర్లను నియమించామన్నారు. వీటిలో ప్రతి 10 ఎన్యూమరేషన్ బ్లాక్ లకు ఒక సూపర్ వైజర్ ను ఏర్పాటు చేశామన్నారు. అందరికీ సర్వేపై పూర్తి స్థాయి శిక్షణను ఇప్పించడం జరిగిందన్నారు. సర్వేకు సంబంధించిన మెటీరియల్ ను కూడా సర్వే సిబ్బందికి అందించామన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా హౌజ్ లిస్టింగ్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని, ఇది గురు, శుక్రవారాల్లో కూడా జరుగుతుందన్నారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రతి ఇంటికి వెళ్లి హౌజ్ లిస్టింగ్ లో భాగంగా ఇంటి డోర్ లకు స్టిక్కర్లు అతికిస్తారన్నారు.

మూడు రోజుల తర్వాత సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ప్రజల నుంచి సమగ్రంగా వివరాలు సేకరించి నమోదు చేసుకుంటారన్నారు. నగరంలోని ఏ ఇంటినీ, ఏ కుటుంబాన్ని వదిలిపెట్టకుండా సర్వే చేస్తామని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఒకవేళ మా సర్వే సిబ్బంది ఏదైనా ఇంటికి వెళ్లినప్పుడు ఆ ఇంటికి తాళం వేసి ఉన్నా, ఆ కుటుంబంలో ఎవరూ అందుబాటులో లేకపోయినా ఇంకో రోజు వెళ్లి సర్వే చేస్తామన్నారు. సర్వే కోసం కేటాయించిన అన్ని రోజుల్లో అన్ని ఇళ్లను సందర్శించి, అన్ని కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్నిపూర్తి స్థాయిలో సేకరిస్తామని కమిషనర్ తెలిపారు. సర్వే పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 83 వేల ఇళ్లను పూర్తిస్థాయిలో సర్వే చేస్తామని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు.నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని 60 డివిజన్లలో 83 వేల ఇళ్లున్నాయని,మున్సిపల్ పరిధిని 725 బ్లాకులుగా విభజించామన్నారు. ఒక్కో బ్లాక్ కు ఒక్కో ఎన్యుమరేటర్ ఉంటాడని, పది మంది ఎన్యుమరేటర్లపైన ఒక సూపర్ వైజర్ ఉంటాడని కమిషనర్ తెలిపారు. ఫస్ట్ పేజ్ లోని మూడు రోజుల్లో జరిగేదంతా హౌజ్ లిస్టింగ్ ప్రాసెస్ జరుగుతుందన్నారు.సెకండ్ ఫేజ్ లో సమగ్ర కుటుంబ సమాచార సేకరణ ఉంటుందన్నారు. సమగ్ర సమాచారాన్ని సేకరించే క్రమంలో వివరాల సేకరణలో ఒక్కో కుటుంబం వద్ద ఎక్కువ సమయం తీసుకునే అవకాశముందన్నారు. అన్నిప్రశ్నలకు సంబంధించిన ప్రొఫార్మాలో ప్రతి కాలమ్ ఫిలప్ చేసేలా వివరాలు సేకరించేందుకు కొంత ఎక్కువ సమయం పట్టొచ్చన్నారు.ఈ లెక్కన ఒక్కో ఎన్యుమరేటర్ ప్రతిరోజు 10 నుండి 15 ఇళ్లకు వెళ్లి సర్వే చేసే అవకాశాలున్నాయన్నారుస

సర్వే కారణంగా విద్యార్ధులు నష్టపోకుండా ఉండేందుకు అటు స్కూల్ ను,ఇటు సర్వేను బ్యాలెన్స్ చేసేలా కార్యాచరణ రూపొందించిందనట్లు కమిషన్ తెలిపారు.ఉదయం పూట స్కూల్ లో డ్యూటీ చేసి,మధ్యాహ్న భోజనం పెట్టాకే టీచర్లు మధ్యాహ్నం పూట సెకండ్ సెషన్ లో మాత్రమే ఎన్యుమరేటర్లుగా లో ఈ సర్వేలో పాల్గొంటున్నారని కమిషనర్ అన్నారు.ఈ విషయంలో టీచర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. టీచర్లకు సర్వే విషయంలో ఇబ్బందులు ఎదురవకుండా సర్వేలో పాల్గొనే టీచర్లు ఏ ప్రాంతంలోని స్కూళ్లలో పనిచేస్తున్నారో వారికి అదే ప్రాంతంలోని ఎన్యుమరేషన్ బ్లాక్ లలో సర్వే డ్యూటీలు వేస్తున్నామన్నారు. దీంతో వారికి సర్వే కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. సర్వేపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, ప్రజల నుంచి సర్వే సిబ్బంది ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తీసుకుంటారనే అనుమానాలు ప్రజలకు అవసరం లేదన్నారు. వివరాలు సేకరించి రాసుకుంటారే తప్ప ఎవరి దగ్గరా ఎలాంటి గుర్తింపుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డుల వంటి డాక్యుమెంట్లు తీసుకోరని స్పష్టం చేశారు.అలాంటి అనుమానాలెవరూ పెట్టుకోవద్దని కమిషనర్ నగర ప్రజలకు భరోసా ఇచ్చారు.


Similar News