కల్వకుంట్ల కవిత లాంటివాళ్లు సమాజానికి చెదపురుగులు

కల్వకుంట్ల కవిత లాంటివాళ్లు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్లు అంటూ ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-09-14 14:56 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కల్వకుంట్ల కవిత లాంటివాళ్లు సమాజానికి చెదపురుగుల లాంటివాళ్లు అంటూ ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ నోటీసులను ఎమ్మెల్సీ కవిత మోడీ నోటీసులుగా అభివర్ణించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించి ఈ వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత లాంటి వాళ్లు రాష్ట్ర పురోగతికి ప్రధాన అడ్డంకి అన్నారు.

    వీళ్ల కుటుంబం చేసిన అవినీతి వల్ల తెలంగాణ రాష్ట్రం రెండు దశాబ్దాల పాటు వెనుకకు వెళ్లిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వాళ్లు ఎంత తొందరగా నేరారోపణ రుజువై దోషిగా తేలితే, చట్టం వీళ్లని రాజకీయాల నుండి బయటికి తరిమేస్తే సమాజానికి అంత మేలవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈమె చేసిన చెడు పనులకు ఈడీ ఆమెకు నోటీసులు పంపిస్తే , వాటిని మోడీ నోటీసులుగా వర్ణించడం కళ్లు నెత్తికెక్కి మాట్లాడిన అహంకారానికి పరాకాష్ట అని అన్నారు.  

Tags:    

Similar News