భారీ వర్షాలకు కుప్పకూలిన బంగ్లా పెంకుటిల్లు..

భారీ వర్షాలకు బంగ్లా పెంకుటిల్లు కుప్పకూలింది.

Update: 2024-09-03 12:23 GMT

దిశ, ఎల్లారెడ్డి : భారీ వర్షాలకు బంగ్లా పెంకుటిల్లు కుప్పకూలింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలోని భవాని పేట గ్రామంలో చూస్తుండగానే ఒక ఇల్లు కుప్ప కూలింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భవాని పేట గ్రామానికి చెందిన వడ్ల ఈశ్వరయ్య వడ్ల సత్తయ్య, ఇద్దరు అన్నదమ్ములకు చెందిన ఇల్లు కుప్పకూలిపోవడంతో పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వనికి పోయారు. వెంటనే సంఘటన స్థలానికి సంబంధిత శాఖ అధికారులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఆ ఇల్లు అర్ధవంతరంగా ఉన్నట్టుండి కుప్పకూలడంతో ఆ ఇంటికి చెందిన వడ్ల ఈశ్వరయ్య వడ్ల సత్తయ్య పడ్డారు. సంఘటనా స్థలానికి పంచాయతీ కార్యదర్శి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మరో సగం ఇల్లు కూడా కూలడానికి సిద్ధంగా ఉండడంతో ఆ ఇంట్లోకి వెళ్లడానికి ఇంటి యజమానుల గజగజ వణుకుతున్నారు.


Similar News