సీఐడీ పోలీసుల అదుపులో పాస్ పోర్ట్ ఏజెంట్

భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన పాస్ పోర్ట్ ఏజెంట్ చెప్పాల సుభాష్‌ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

Update: 2024-01-19 16:43 GMT

దిశ, భీంగల్: భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన పాస్ పోర్ట్ ఏజెంట్ చెప్పాల సుభాష్‌ ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ ఆఫీస్ సమీపంలో ఆఫీస్‌ను ఏర్పార్చుకొని పాస్ పోర్ట్ ఇప్పిస్తూ కమీషన్ ఏజెంట్‌గా నిత్య వృత్తిగా పని చేసి సుభాష్ ఇంటికి వచ్చిన సీఐడీ పోలీసులు ఇంట్లో ప్రవేశించి గంట పాటు ఇంటి వారిని బయటకు పంపకుండా విచారణ నిర్వహించినట్లు సమాచారం. అనంతరం సీఐడీ బృందం సుభాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై స్థానిక సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా సుభాష్‌ను సీఐడీ విభాగం పోలీసులు కస్టడిలోకి తీసుకొని వెళ్లినట్లు తెలిపారు. కారణాలు తెలియదని తెలిపారు. నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి, నకిలీ పాస్ పోర్టులు చేస్తున్నారన్న సమాచారం మేరకు సుభాష్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. సినిమాల్లో, సీరియల్స్‌లో చూసే సీఐడీ పోలీసు బృందం భీంగల్ పట్టణ కేంద్రానికి రావడం కలకలం సృష్టించింది. సుభాష్ అరెస్ట్ పూర్తి కారణాలు తెలిసి రాలేదు.


Similar News