ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేరిస్తే మాకు సంబంధం లేదు .. విద్యాశాఖ

నిజామాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభంమై త్రైమాసిక పరిక్షల సమయంలో గుర్తింపు లేని పాఠశాలల విషయంలో జిల్లా విద్యాశాఖ చేతులేత్తిసింది.

Update: 2022-09-23 14:25 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభంమై త్రైమాసిక పరిక్షల సమయంలో గుర్తింపు లేని పాఠశాలల విషయంలో జిల్లా విద్యాశాఖ చేతులేత్తిసింది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలొనే గుర్తింపు లేని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల గుర్తింపు ఉన్నది లేనిది, రిజిస్ర్టేషన్ రెన్యూవల్ లేనిది గుర్తించి మూసి వేయడం విద్యాశాఖ విధి. కాని నిజామాబాద్ జిల్లా అధికారులు గుర్తింపు లేని పాఠశాలల విషయంలో ఒకటి రెండు సార్లు నోటిస్ లు ఇచ్చి వదిలేశారు. దాంతో అయా పాఠశాలలు గుర్తింపు లేకున్న అడ్మిషన్ లను నిర్వహించి తరగతులును ప్రారంభించాయి. మరి కొన్ని ప్రైవేట్ పాఠశాలలు రిజిస్ర్టేషన్ కలిగిన పాఠశాల పేరు స్థానంలో కొత్త పేరు, తోక పేర్లతో కొత్త బ్రాంచ్ లను ఎర్పాటు చేసి తరగతులు నడుపుతున్నాయి.

జిల్లాలో ఒక్క శాశ్వత ఎంఈఓ లేరు. ఉన్నవాళ్ళా సీనియర్ పీజీ హెడ్మాస్టర్ లు కావడంతో వారికి ఒక్కొక్కరికి రెండు, మూడు, నాలుగు మండలాల భాధ్యతలు ఉండటంతో గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల విషయంలో ఎమి చేయలేకపోయారు. నిజామాబాద్ ఎంఈఓ కు ఐదు మండలాల భాధ్యత ఉండటంతో వారు చేతులేత్తేశారు. నిజామాబాద్ నగరంలో ఒక్కొక్క పాఠశాలకు గుర్తింపు లేదని అందులో పిల్లలను చేర్చితే తమ బాధ్యత లేదని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గా ప్రసాద్ ప్రకటన జారీ చేశారు. శుక్రవారం డీఇఓ ప్రకటన పై ప్రజలు, విద్యార్థులు, మేధావులు, విద్యార్థి సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.

Tags:    

Similar News