జీవన్ మాల్ కు షూరిటీ ఉన్న వ్యక్తుల భూముల స్వాధీనానికి నోటీసులు...

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో జీవన్ మాల్ కి షూరిటీ ఉన్న వ్యక్తుల భూముల స్వాధీనానికి సోమవారం నోటీసులు జారీ అయ్యాయి.

Update: 2024-10-21 16:25 GMT

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో జీవన్ మాల్ కి షూరిటీ ఉన్న వ్యక్తుల భూముల స్వాధీనానికి సోమవారం నోటీసులు జారీ అయ్యాయి. ఆర్మూర్ పట్టణ కేంద్రంగా టీఎస్ ఆర్టీసీ స్థలంలో విష్ణు జిత్ డెవలప్మెంట్ ఇన్ ఫ్రా డెవలప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఒప్పందం మేరకు మాల్ నిర్మాణాన్ని గతంలో చేశారు. మాల్ నిర్మాణ సమయంలో షూరిటీ ఇచ్చిన వ్యక్తుల భూముల స్వాధీనానికి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రం నడిబొడ్డులో ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన గల జీవన్ రెడ్డి మాల్ నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ తో విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ. 45 కోట్ల 46 లక్షల 90 వేలు వడ్డీతో సహా అసలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. దీనికి షూరిటీ ఇచ్చిన ఆశన్న గారి వెంకట రాజన్న, కాట్ పల్లి గంగారెడ్డి, యాల్ల నరేందర్, నక్కల లక్ష్మణ్ తమ భూములను కార్పొరేషన్ కు షూరిటీ కింద తానాక పెట్టారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో భూములు స్వాధీనం చేసుకుంటామని కోరుతూ వ్యవసాయ భూముల వద్ద ప్ల కార్డులు పెట్టి కార్పొరేషన్ అధికారులు నోటీసులను అతికించారు.వారి భూముల వద్ద బకాయి ఉన్న డబ్బుతో పాటు షూరిటీ ఇచ్చిన వ్యక్తుల పేర్లను వారి భూముల వివరాలను పేర్కొంటూ షూరిటీ దారులు, బకాయి పడ్డ డబ్బులు చెల్లించినట్లయితే స్వాధీనం చేసుకుంటామని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అతికించారు. షూరిటీ ఇచ్చిన పలువురి భూముల వద్ద ప్ల కార్డులు పెట్టి నోటీసులు అతికించడం పట్ల ఆర్మూర్ లో చర్చనీయాంశంగా మారింది. జీవన్ మాల్ పేరిట ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో తీసుకున్న రుణం అసలు వడ్డీ బకాయి పడడంతో.. ఆ అధికారులు లోన్ షూరిటీ దారులకు నోటీసులు అందించారు. దీంతో ఆర్మూర్ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. కాగా జీవన్ మాల్ కు గతంలో ఇంతకుముందు ఆర్టీసీకి బకాయి పడ్డ కిరాయి డబ్బులు, విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ.. నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో మారు సోమవారం స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ అధికారులు బకాయిలు చెల్లించాలంటూ.. షూరిటీ దారులకు, వారి భూములను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేయడం పట్ల చర్చనీయాంశంగా మారింది.


Similar News