హత్యకు బాధ్యులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు : డీఎస్పీ

నాచుపల్లి గ్రామంలో హత్యకు గురి కాబడిన రాములు ఘటనలో

Update: 2024-01-01 10:21 GMT

దిశ,బాన్సువాడ : నాచుపల్లి గ్రామంలో హత్యకు గురి కాబడిన రాములు ఘటనలో బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నాచుపల్లి విచ్చేసిన డీఎస్పీ మృతుడి మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పారదర్శకమైన విచారణ చేపట్టి, ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షిస్తామన్నారు.

అంతకు ముందు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మృతికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేస్తేనే మృత దేహాన్ని పోస్టుమార్టంకు పంపిస్తామని భీష్మించుకొని కూర్చోవడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. డీఎస్పీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో అందరూ వెనక్కి తగ్గారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజ్, నందు పటేల్, బోయిని శంకర్, ఖలేక్, బస్వారాజ్, విఠల్ తదితరులు ఉన్నారు.

Similar News