ఎన్ని కార్లున్నా...ఆయనకి అంబాసిడరే అచ్చొచ్చింది

ఎన్ని కార్లున్నా ఆయనకి అంబాసిడరే అచ్చొచ్చింది. అందుకే అందులోనే వెళ్లి నామినేషన్​ దాఖలు చేశారు.

Update: 2023-11-09 14:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్ని కార్లున్నా ఆయనకి అంబాసిడరే అచ్చొచ్చింది. అందుకే అందులోనే వెళ్లి నామినేషన్​ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బిగాల గణేష్ గుప్త గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సెంటిమెంట్ లో భాగంగా తన అంబాసిడర్ కారులో వచ్చి నామినేషన్ వేశారు. ఇంటి వద్ద నుంచి స్వయంగా గణేష్ గుప్త కారు నడుపుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తరలివచ్చారు. అంతకు ముందు గణేష్ బిగాల నామినేషన్ వేస్తున్న

    శుభ సందర్భంగా తన తల్లి సువర్ణ మాల, అమ్మమ్మ దీవెనలు తీసుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయం, నాందేవ్ వాడ శ్రీ విఠలేశ్వర ఆలయం, మాక్లూర్ గ్రామం లోని శ్రీ పాండు రంగ విఠలేశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి మున్సిపల్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్ పార్టీ ఎన్ ఆర్ ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ,నగర మేయర్ దండు నీతు కిరణ్ , నాయకులు ఎస్ఏ అలీం, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవి చందర్, సత్య ప్రకాష్, సిర్ప రాజు, యెనుగందుల మురళి, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

Tags:    

Similar News