ప్రజాపాలన కార్యక్రమం పొడిగింపుపై సీఎంతో చర్చిస్తాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Update: 2024-01-05 10:42 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కార్యక్రమం పట్ల ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సుడిగాలి పర్యటన చేసిన మాజీ మంత్రి ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు.

    ప్రజా పాలన సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ మహిళా ఆడపడుచులు మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆరు రోజులపాటు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి ఇంకొన్ని రోజులు పొడిగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న

    కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓర్వలేక కేటీఆర్ నెలరోజులు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు దగ్గర కావడం లేదు అని విమర్శించడం సిగ్గు చేటన్నారు.10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందని విమర్శించారు. స్కాం లు, కేసీఆర్ కుటుంబ స్వలాభం, ఆస్తులు, పెంచుకున్నారే తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కేశ వేణు, భక్తవత్సలం, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News