నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం పాలసీ షురూ

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2023-25 నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి.

Update: 2023-12-01 12:26 GMT

దిశ ప్రతినిది, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2023-25 నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి. శుక్రవారం నుంచి జిల్లాలోని 151 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే మద్యం దుకాణాల లైసెన్స్ ల జారీ జరుగలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పర్మిషన్ రావాల్సి ఉండగా అంతకన్నా ముందుగానే మద్యం దుకాణాల ప్రారంభ సమయం కావడంతో ముందుగా దుకాణాలను తెరిచారు. కొత్త మద్యం పాలసీలో లైసెన్స్ లు దక్కించుకున్న వ్యాపారులు లైసెన్స్ లు లేకున్నా టెండర్ల సమయంలో లక్కీ డ్రా ద్వారా కన్ఫర్మేషన్ లెటర్ పొందిన వారు మద్యం దు కాణాలను తెరిచారు. మాక్లూర్ లోని ఐఎంఎల్ డిపోలో చలాన్లు చెల్లించి మద్యం కొనుగోలు చేశారు. వాటి నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభించారు. మద్యం అమ్మకాల తొలిరోజు కొరకు వైన్స్ లను అలంకరించడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్లను కూడా పెట్టినట్లు సమాచారం. 


Similar News