పర్యాటక కేంద్రంగా నాగన్న బావి

లింగంపేట్ మండల కేంద్రంలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు.

Update: 2024-01-17 12:08 GMT

దిశ, లింగంపేట్ : లింగంపేట్ మండల కేంద్రంలోని నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడించారు. బుధవారం మండల కేంద్రంలోని నాగన్న బావి అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాల పరిరక్షణే ధ్యేయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు

    పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నాగన్న బావి పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. స్థలాన్ని సర్వే నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. హద్దులకు కంచె ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. 18 గుంటల భూమిని నాగన్న బావికి కేటాయించినట్లు వెల్లడించారు.ఈ భూమిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ఆయనతో పాటు తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ మల్లికార్జున్​రెడ్డి, ఎంపీఓ ప్రభాకర్ చారి, గిర్దావర్ బాలయ్య, సర్వేర్లు మౌనిక, అభిలాష్ తోపాటు పట్టేదార్ మనోహర్​రావు పాల్గొన్నారు.  


Similar News