మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ ఆదాయానికి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో భారీగా గండి పడుతుంది.

Update: 2024-06-26 06:21 GMT

దిశ ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ ఆదాయానికి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో భారీగా గండి పడుతుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లి, కొటారుమూరు తదితర ఏరియాల్లో అనుమతులకు విరుద్ధంగా వందల సంఖ్యలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్న ఆర్మూర్ మున్సిపల్ లోని మున్సిపల్ టిపిఓ విభాగం అధికారులు చర్యలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో విధులు నిర్వహించే అధికారులకు మున్సిపల్ పరిధిలోని పాలకవర్గ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిళ్ళను అధికారిక గణం ఎదుర్కొంటుంది. ప్రజలు ఫిర్యాదు చేసిన సందర్భంలో సైతం మున్సిపల్ ఉన్నతాధి కారులు మున్సిపల్ కౌన్సిలర్లకు చెప్పందే ఆ వార్డుల్లో పరిశీలనకు వెళ్లవద్దంటూ ఆదేశాలు ఇస్తున్నట్లు వినబడుతుంది.

ఈ ఆదేశాలతో మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమేయం లేనిది ఏం చేయలేని పరిస్థితి తయారైందని ఆర్మూర్ మున్సిపల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికార గణం ఏం పని చేయకుండా ఏ తీరుగా చర్యలు తీసుకోకుండా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వందలాది అనుమతులు లేని మున్సిపల్ కార్యాలయానికి టాక్స్ లు చెల్లించని నిర్మాణాలు ఉన్న మున్సిపల్ అధికారులు ఆ పర్మిషన్లు లేని అక్రమ నిర్మాణదారులకు కొలతలు తీయించి రెట్టింపు(డబల్) పన్నులను వేయాల్సి ఉన్న తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్య వైఖరితో మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదే కాకుండా ఇల్ల నిర్మాణాల విషయంలో ఇంటి నిర్మాణాలు పూర్తి కాకుండానే ఒకటవ అంతస్తుకి ఇంటి నంబర్లను కేటాయిస్తూ టాక్స్ లను మున్సిపల్ అధికారులు జారీ చేస్తున్నారు.

ఆ తర్వాత ఆ ఇళ్ల నిర్మాణదారులు రెండు మూడు అంతస్తులను కట్టుకొని మున్సిపల్ కు ఎలాంటి ఆదాయం చెల్లించకుండా కనీసం ఇంటి టాక్స్ రివిజన్ చేయించకుండా కథ నడిపిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో ఇంత అద్భుతంగా నడుస్తున్న అధికారిక, పాలకవర్గ గణం ఇవి ఏం పట్టనట్టు కాలం వెళ్లదీస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. గృహ అవసరాల పేరిట అనుమతులు పొందుతూ కమర్షియల్ నిర్మాణాలు చేస్తున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆర్మూర్ ప్రజలు మున్సిపల్ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. వీటితోపాటు ఇంటి నిర్మాణాల విషయంలో నార్మల్, ఫాస్ రూపేనా ఇంటి నిర్మాణాలకు కొలతలు తీయించి టాక్స్ లు వేసి మున్సిపల్ ఆదాయం పెరిగేలా చూడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తి నట్లుగా చూసీచూడ నట్లుగా ముందుకు వెళ్తున్నారు.

మున్సిపల్ కు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే టీపీఓ, రెవిన్యూ విభాగాల్లో విధులు నిర్వహించే అధికార గణానికి తీవ్రంగా రాజకీయ ఒత్తిళ్లు జరుగుతున్నట్లు ఆర్మూర్లో జనం చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజు లు మున్సిపల్ టీపీఓ హరీష్, మున్సిపల్ రెవిన్యూ ఇంచార్జ్ అయుం తో మాట్లాడి ఆర్మూర్ మున్సిపల్ ఆదాయానికి పడుతున్న గండీలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ రహదారి వెంట ఒకే వ్యక్తి స్థలంలో అనుమతులు లేని 19 దుకాణాలు...

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్ మూర్ ఏరియాలోని జాతీయ రహదారి 63 నంబర్ రోడ్డు వెంట ఒక వ్యక్తికి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ స్థలంలో.. ఇంకా వెంచర్ నిర్మించని ఖాళీ స్థలంలో మొత్తం 19 దుకాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు చేయిస్తున్నాడు. కోటార్ మూర్ రెవిన్యూ ఏరియాలోని 22 సర్వే నంబర్ స్థలంలో కొద్దిగా లేఔట్ చేసి, మరి కొద్దిగా లేఔట్ చేయని స్థలాల్లో ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా .. దర్జాగా ఆ స్థల వ్యక్తి 19 మంది దుకాణా దారులకు కిరాయిలకు స్థలాలను ఇచ్చి ప్రతి నెల కిరాయిలు వసూలు చేస్తున్నాడు. జాతీయ రహదారి వెంబట ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్ల నిర్మాణాలను చేసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్న ఆ వ్యాపారులు.. ఆ స్థల యజమాని నయా పైసా మున్సిపల్ కార్యాలయానికి ట్యాక్స్ లు చెల్లించడం లేదు. ఇంత తంతు జాతీయ రహదారి వెంబడ నడుస్తున్న మున్సిపల్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి సైతం చూడడం లేదు.

ఈ స్థలంలో ఎలాంటి మున్సిపల్ నిర్మాణ అనుమతులు లేకుండా మార్బుల్స్, స్టిల్, వెల్డింగ్, పాత ఇనుప సామాన్, సిమెంట్ ఇటుకల తయారీ, హోటల్ , విగ్రహాల తయారీ తదితర వ్యాపారాలు నిర్వహించేందుకు దర్జాగా షెడ్లను నిర్మాణాలు చేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఇదే తరహాలో పెర్కిట్ కొటార్ మూర్ లోని 44,63 జాతీయ రహదారుల జంక్షన్ నుండి మామిడిపల్లి జాతీయ రహదారి వెంబడి శివారులో వరకు, నిజామాబాద్ రోడ్డు లోని దోబీ ఘాట్ శివారు ప్రాంతమైన అంకాపూర్ గ్రామ పొలిమేర వరకు ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో షెడ్లను నిర్మాణాలు చేసుకొని మున్సిపల్ పాలకవర్గ రాజకీయ అండదండలతో దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. సదరు అక్రమ నిర్మాణదారులపై, వ్యాపారస్తులపై ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ , ఇతర అధికారులు చర్యలు చేపట్టి ఆర్మూర్ మున్సిపల్ ఆదాయం పెరిగేలా చూడాలని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.


Similar News