దోమలు బాబోయ్.. దోమలు

నగరంలో పలు డివిజన్ల పరిధిలో గల కాలనీలలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.

Update: 2024-02-08 16:28 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నగరంలో పలు డివిజన్ల పరిధిలో గల కాలనీలలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా దోమల మందు పిచికారీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలతో డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు వస్తున్నాయని, తరచుగా హాస్పిటలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క పరిసరాలు శుభ్రంగా ఉంచుకో వాలని డాక్టర్లు చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

    చుట్టు పక్కల ప్రాంతాల వారు చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ వేయడం, మురికి కాలువ తీయకపోవడంతో దోమల బెడద ఎక్కువవుతుంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి వార్డులలో దోమల మందు పిచికారీ చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. కాగా నిజామాబాద్ నగరంలో దోమల బెడద పై మున్సిపల్ కార్పొరేషన్ ఎంహెచ్ ఓ ను దిశ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. కనీసం మున్సిపల్ పరిధిలో వివిధ కాలనీలో దోమల కోసం ప్రతి ఏటా ఎంత ఖర్చు పెడుతున్నామనేది తెలపకపోగా వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. దాంతో ఈ విషయం తెలిసిన కాలనీవాసులు సమాచారం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Similar News