పంట నష్టం పై రైతులు ఆందోళన చెందవద్దు.. ఎమ్మెల్యే

అత్యధికంగా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-03 12:29 GMT

దిశ, బాల్కొండ : అత్యధికంగా కురుస్తున్న వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు అధికారులను ఇన్ ఫో, అవుట్ ఫ్లో వివరాలను అడిగితెలుసుకున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు గోదావరిలోకి మిగులు జలాలను విడుదల చేయాలన్నారు. ప్రాజెక్ట్ ఎగువ భాగాన బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో పంట 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరినప్పటికీ నీట మునగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టులోకి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు నీటి విడుదల పెంచుతూ తగ్గిస్తున్నారు. 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పటికీ ప్రాజెక్టుకు ఎలాంటి డోకా లేదన్నారు. వర్షాల వలన ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అక్కడక్కడ వర్షాల వలన ఇండ్లు కూలి పునరావసకేంద్రాలకు తరలించామన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. పోచంపాడు జిల్లా విద్యుత్ పత్తి కేంద్రంలో సామర్ధ్యం కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం ఆనందంగా ఉందన్నారు. వారి వెంట కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, మనలా మోహన్ రెడ్డి, సీడ్ కోర్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నగేష్ రెడ్డి అరికిల నర్సారెడ్డి, గడుగు గంగాధర్ సంతోష్ కుమార్, రమేష్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.


Similar News