MLA Madanmohan : డిప్యూటీ సీఎంను కలిసిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్మోహన్( MLA Madanmohan )అన్నారు.
దిశ, ఎల్లారెడ్డి :ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని ఎమ్మెల్యే మదన్మోహన్( MLA Madanmohan )అన్నారు. నియోజకవర్గంలోనే ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రి నిధులు లేక అర్ధంతరంగా ఆగిపోయిందని, త్వరితగతిర నిధులు మంజూరు చేస్తే ఆసుపత్రి పనులు ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులు ఉన్నాయని,నిధుల మంజూరు కొరకు ప్రత్యేక కృషి చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయినందున నిధులు లేక కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని నిధులు మంజూరు చేస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణమై ప్రజలకు సేవలు అందుతాయని ఉపముఖ్యమంత్రిని ఎమ్మెల్యే మదన్మోహన్ కోరారు. ఎమ్మెల్యే నిధుల మంజూరు కోరిన.. అనంతరం ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీంతో ఎమ్మెల్యే మదన్మోహన్ హర్షం వ్యక్తం చేశారు.