MLA Kattipalli Venkataramana Reddy : సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే
గత నెల 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.
దిశ,కామారెడ్డి : గత నెల 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (MLA Kattipalli Venkataramana Reddy )అన్నారు. నేటి నుంచి జిల్లా స్థాయిలో క్రియాశీల సభ్యత్వం చేపట్టాలని, 100 మందిని బీజేపీ లో సభ్యులుగా చేర్చిన వారే క్రియాశీల సభ్యులుగా అర్హులని అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన మంగళవారం బీజేపీ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ...100 మందిని పార్టీలో సభ్యులుగా చేర్చిన వారు 100 రూపాయలు ఆన్ లైన్ లో నమో ఆప్ లో చెల్లించి, క్రియాశీల సభ్యులుగా చేరాలనీ, వారికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు క్రియాశీల సభ్యత్వం అందజేస్తుందన్నారు. బీజేపీ జిల్లా సభ్యత్వం ప్రభారీ ఆలే భాస్కర్ మాట్లాడుతూ..జిల్లాలో మండలానికి 100 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలనీ , పార్టీలో బూత్ అద్యక్షుడు నుండి జాతీయ అధ్యక్షుడు వరకు అందరూ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటారని, క్రమ శిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలన్నారు. క్రియాశీల సభ్యులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార,సభ్యత్వం ప్రభారి ఆలే భాస్కర్ చేతుల మీదుగా క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమములో మాజీ మంత్రి నేరెళ్ళ ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, నీలం చిన్న రాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్లు లక్మారెడ్డి, లింగారావు, శ్రీనివాస్, సభ్యత్వ జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్, క్రియాశీల సభ్యత్వ ఇంచార్జి విపుల్ జైన్, కౌన్సిలర్ లు శ్రీనివాస్, నరేందర్ నాయకులు బాపురెడ్డి, రాజు పాటిల్, రవీందర్ రావు, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.