ఆ గ్రామంలో మిత్తిల గణపతి..

గణపతి పండగ వచ్చిందంటే చాలు చందాల కోసం యువకులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఎంతో కొంత రాయమని, రాసేదాకా విడవమనే సంఘటనలు చూస్తూనే ఉంటాం.

Update: 2024-09-01 10:18 GMT

దిశ, గాంధారి : గణపతి పండగ వచ్చిందంటే చాలు చందాల కోసం యువకులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఎంతో కొంత రాయమని, రాసేదాకా విడవమనే సంఘటనలు చూస్తూనే ఉంటాం. వినాయక చవితి పండగ పూట పునరావృతమయ్యే సంఘటనలు ఇవి. ప్రతి యూత్ సభ్యులు ముఖ్యంగా వ్యాపారస్తులు, ఇంటి యజమాని, సిండికేట్లను, అసోసియేషన్ లను అందరిని తప్పనిసరిగా చందాలు రాయించుకుంటారు. అలాగే డబ్బులు వసూలు కూడా చేసి వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహిస్తుంటారు. కాని ఓ గ్రామంలో మాత్రం వినూత్న ఆలోచనతో వినాయక చవితిని చేసుకుంటున్నారు. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఏ జిల్లాలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు. దాదాపు 1994 సంవత్సరంలో ప్రారంభించిన 42 మంది పెద్దలతో తమ వంతుగా మొదటగా ఐదు, పది, యాభై రూపాయలతో దాదాపు 6000 మొదటి సారిగా అందరూ తలో చేయి వేసి వసూలు చేసిన డబ్బులే తప్ప ఇప్పటికీ చందాలు కూడా అడగని గ్రామంగా పేరుపొందింది. 6000 రూపాయలను మొదటగా వసూలు చేసిన డబ్బులు అందులో వినాయక ఖర్చులకు పోగా ఎన్ని డబ్బులు మిగిలితే అన్ని డబ్బులు సంవత్సరానికి మళ్లీ వినాయక చవితి వచ్చేలోపు చెల్లించే విధంగా గణేష్ కమిటీ సమక్షంలో పేపర్ పై రాసుకొని రూపాయి మిత్తికి ఇచ్చేవారు.

అలా తీసుకున్న డబ్బులు అసలు మీతో కలిసి మల్లచ్చే గణపతి పండగకు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. అప్పుడు అసలు మిత్తి రెండు వస్తాయి మళ్లీ ఎవరికైనా అవసరమైతే మళ్లీ ఆ డబ్బులను మిత్తీలకు ఇచ్చి మళ్లీ కాగితం రాసుకొని మళ్లీ వినాయక చవితికి అసలు మిత్తి వసూలు చేసేవారు. ఇలా 20 సంవత్సరాలుగా చేస్తూ చేస్తూ అక్షరాల దాదాపు మిత్తి పైసలే 16 లక్షల రూపాయలకు చేరిందంటే అంత ఆషామాషీ విషయం కాదు. 1994 లో మొదటగా రూపాయి వడ్డీ ఉండగా 2005లో వడ్డీ పెంచుతూ రెండు రూపాయలకు చేసినట్లు గ్రామ గణేష్ కమిటి సభ్యులు తెలిపారు. అలా 1994 నుండి మొదలైన ప్రస్థానం పెద్దలు చూపిన దారి అదే బాటలో నేటి వరకు యువత, గ్రామస్తులు అదే దారిలో నడుస్తున్నారు. కొంత నగదుతో శ్రీరాముల వారి ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికీ కూడా ఇంకా మిత్తులతోనే ప్రతి ఏటా గణపతి పండగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది అక్టోబర్ 19, 20, 21వ తేదీలలో తాము జమ చేసిన వ్యక్తుల రూపంలో వచ్చిన డబ్బులతో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుందని గ్రామస్తులు తెలిపారు.

ఇలాంటి మాహత్తర కార్యక్రమం మా ఊరు నుండి ప్రారంభం కావడం మా అదృష్టం - తాజా మాజీ సర్పంచ్ నారాయణ

పెద్దలు చూపిన మార్గంలో నడవడం వల్లే రూపాయితో మొదలైన గణేష్ ఉత్సవాల పండగ మిత్తిల డబ్బులతో నేటికీ ఒక 16 లక్షల నుండి 18 లక్షల వరకు చేరుకుంది. అంతే కాకుండా ఆ డబ్బులు కూడా ఒక మహత్తర కార్యక్రమం శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఉపయోగపడడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.


Similar News