మండలంలో పూర్తి కావస్తున్న మిషన్ భగీరథ సర్వే

మండలంలో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే పూర్తి కావస్తోంది. ప్రతీ ఇంటికి నీటి సరఫరా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-28 09:26 GMT

దిశ, ఏర్గట్ల : మండలంలో మిషన్ భగీరథ ఇంటింటి సర్వే పూర్తి కావస్తోంది. ప్రతీ ఇంటికి నీటి సరఫరా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కుటుంబాల సంఖ్య, జనాభా పెరగడంతోపాటు పలు చోట్ల భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని తరచూ పైప్ లైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో భగీరథ పథకం తీరుతెన్నులు తెలుసుకునేందుకు సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి సరఫరా ఎలా జరుగుతోంది. ప్రతీ రోజు ఎన్ని లీటర్ల నీరు సరఫరా అవుతోంది.

కొత్తగా ఎన్ని ఇళ్ల నిర్మాణం జరిగింది. ఎన్ని నల్లా కనెక్షన్లు అవసరం. అదనంగా ఎంత నీరు అవసరం అనేది తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఆయా వివరాల నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ ను రూపొందించింది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జీపీ సిబ్బంది, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి గ్రామానికి రెండు నుంచి ఐదు గ్రూపులుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుంటున్నారు. మగవాళ్లు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంత మంది, కులం, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ ఫోన్ నెంబర్ నమోదు చేయడంతో పాటు భగీరథ నల్లా వద్ద ఇంటి యజమాని ఫొటో తీసి సదరు యాప్ లో పొందుపరుస్తున్నారు.

పర్యవేక్షిస్తున్న మండల స్థాయి అధికారులు

మండలంలో సర్వే చేస్తున్న పంచాయతీ కార్యదర్శులతో పాటు మండల పరిషత్ అధికారి వెంకటేశ్వర్లు అలాగే పంచాయతీ అధికారి శివచరణ్ స్వయంగా భగీరథ ఇంటింటి సర్వేను పర్యవేక్షిస్తున్నారు. పలు గ్రామాల్లో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి భగీరథ నీటి సరఫరా తీరు ఎలా ఉంది. రోజు నీటి సరఫరా ఎలా జరుగుతోంది. కుటుంబానికి సరిపడా నీరు వస్తోందా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకొని మొబైల్ యాప్ లో లబ్దిదారుల వివరాలు, ఫొటోలతో సహా పొందుపరుస్తున్నారు.

రెండు రోజుల్లో పూర్తి చేస్తాం....మండల పంచాయతీ అధికారి శివచరణ్


ఈ నెల 10న సర్వే ప్రారంభం కాగా పది రోజుల్లో పూర్తి చేయాలని అదేశాలు ఉన్నాయి. మండల కేంద్రంతో పాటు ఏడు గ్రామాలు ఉండగా అందులో మొత్తం 5134 కనెక్షన్లు ఉన్నాయి. ఈ నెల 27 వరకు 4479 (87. 24 శాతం) సర్వే పూర్తయింది. క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా ఇప్పటి వరకు మండలానికి మొత్తంగా కొత్తగా 300 కనెక్షన్లు గుర్తించాము. వంద శాతం సర్వే ఇంకా రెండు రోజుల్లో పూర్తి చేస్తాం.

గ్రామం సర్వే పూర్టైనవి

ఏర్గట్ల 1286

తొర్తి 614

బట్టాపూర్ 415

తడపాకల్ 503

రాంపూర్ 640

దోంచంద 432

గుమ్మిర్యాల్ 393

నాగేంద్రనగర్ 196

మొత్తం 4479 నల్లా కనెక్షన్లు సర్వే పూర్తి కాగా, ఇంకా 655 కనెక్షన్లు రెండు రోజుల్లో పూర్తి చేస్తాం.


Similar News