పేకాటకోసం ఇన్ స్టంట్ ఫైనాన్స్ సౌకర్యం...

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా వర్ని మండలం నుంచి విడిపోయి ఏర్పడిన రుద్రూర్ మండలంలో జోరుగా మూడుముక్కులాట సాగుతుంది.

Update: 2023-03-11 12:44 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో కొత్తగా వర్ని మండలం నుంచి విడిపోయి ఏర్పడిన రుద్రూర్ మండలంలో జోరుగా మూడుముక్కులాట సాగుతుంది. రుద్రూర్ మండలంలో ఫేమస్ అయిన మిర్చి గ్యాంగ్ ఆధ్వర్యంలో ఈ పేకాట సాగడం విశేషం. రుద్రూర్ మండల కేంద్రంకు చెందిన మిర్చి అతని ఇద్దరు సహచరులు కలిసి పేకాటను నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ గండి ప్రాంతంలో స్తానిక గిరిజనులతో కలిసి పేకాట నిర్వహించిన మిర్చి గ్యాంగ్ ఇప్పుడు ఏకంగా సొంతూరులోనే దుకాణం తెరిచారు. లింగంపల్లి శివారులో, కొత్త కాలువ (బొప్పాపూర్ ) రోడ్డులో గ్యాంగ్ లకు గ్యాంగ్ లను పెట్టి పేకాట ఆడిస్తున్నారు.

రూ.50 వేలు ఉంటేనే పేకాటకు అనుమతినిస్తూ రూ.5 వేల గేమ్ తో పేకాట ఆడిస్తున్నారు. రుద్రూర్ బస్టాండ్ లో ఇద్దరు మిర్చి గ్యాంగ్ ఇద్దరు మనుషులను పెట్టి పేకాట ఆడేందుకు వచ్చిన వారిని పికప్ చేసుకోవడం, వారికి మధ్యాహ్న భోజనం, రాత్రి మందు ఏర్పాట్లను చేస్తుంది. కొత్తగా ఏర్పడిన మండలం అయినప్పటికీ మిర్చి గ్యాంగ్ కు ఉన్నహవాతో పొరుగున్న ఉన్న మహారాష్ట్రతో పాటు రుద్రూర్, బాన్సువాడ, బోధన్, వర్ని, నిజాంసాగర్ నుంచి పేకాట రాయుల్లను రప్పించి పేకాట ఆడిస్తున్నారు. మిర్చిగ్యాంగ్ కు ఖాకీలకు సంబంధాలు ఉండడంతో అక్కడ పేకాట గురించి ఎవ్వరు కిక్కురుమనరు.

మిర్చి ఆలియాస్ కు ఉన్న మరో పేరే అందుకు కారణం. పోలీసు అధికారులకు నెలకు రూ.50 వేల వరకు మామూళ్లు ఇస్తున్నామని వారు పట్టుకుంటే విడిచించే పూచి తపదేనని పేకాట ఆడిపించడం నిత్యతంతుగా మారింది. రుద్రూరు నలుదిక్కుల ఉన్నప్రాంతాలలో అడ్డాలను ఏర్పాటు చేసుకుని పేకాట ఆడిస్తారనేది బహిరంగ రహస్యం.

నస్రుల్లాబాద్ గండిలో పేకాట ఆడించిన ఎక్స్ పీరియన్స్ తో క్లబ్ కు మించిన సౌకర్యాలు కల్పిస్తుండడంతో పేకాట రాయుళ్లు అక్కడ క్యూ కడుతున్నారు. ఖరీదైన కారులతో పాటు బైక్ లు, బస్టాండ్ వద్ద ఆగగానే మిర్చి గ్యాంగ్ సభ్యులు వాలిపోయి వారిని పేకాట స్థావరాలకు తరలించే సదుపాయం ఉంది. దానితో చాలా మంది అక్కడ పేకాట ఆడడానికి ఆసక్తి చూపుతున్నారు. పేకాట ఆడే వారికి డబ్బులు అవసరం ఉండగా ఫైనాన్స్ సౌకర్యానికి ఏర్పాట్లు ఉండడం, పేకాటను ఎంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

బంగారంతో పాటు వాహనాలను తాకట్టు పెట్టుకుని ఉన్నఫళంగా డబ్బులు ఇస్తారని, అది కూడా అప్పటికప్పుడు చెల్లించేటట్లయితే ఒక వడ్డీ రేటు, 10 రోజులయితే మరో రేటు, గడువు దాటితో అది జప్తయ్ పోతాయాట. రుద్రూర్ మండల కేంద్రంలో మిర్చిగ్యాంగ్ ఆధ్వర్యంలో పేకాట మూడు ముక్కలు.. ఆరు షోలుగా రంజుగా సాగుతుంది. జనవరి మాసంలో మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారం నిర్వహించే యువకుడు పేకాటలో లక్షలు పొగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న పోలీసులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణం.

Tags:    

Similar News