సిద్ధులగుట్ట పై మంత్రి జూపల్లి ప్రత్యేక పూజలు...
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్ట ఆలయాన్ని సోమవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్ట ఆలయాన్ని సోమవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్ధులగుట్ట ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర మంత్రి 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి చెప్పారు.
అంతకుముందు పెర్కిట్ కొటార్ మూర్ ఏరియాల్లో 44, 63 నంబర్ల జాతీయ రహదారుల జంక్షన్ వద్ద రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆర్మూర్ లోని కాంగ్రెస్ నాయకులతో కలిసి అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్ చైర్మన్ షేక్ మున్న, ఆర్మూర్ పట్టణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, చేపూర్ ఎస్.కె.చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు ఎన్.వి.రవీందర్ రెడ్డి (చిట్టి), మామిడిపల్లి మాజీ సర్పంచ్ గడ్డం జ్యోతి మారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.