వీఓఏ ఇంటి ముందు బైఠాయించిన మహిళా సంఘాల సభ్యులు..

మహిళా సంఘాల సభ్యుల డబ్బులు రూ.36లక్షలను వీఓఏ బాబాగౌడ్ పక్కదారి పట్టించి తన కుటుంబ సభ్యుల వ్యక్తి గత ఖాతాకు మల్లించి వాటిని వాడుకున్నట్లు పీడీ సాయన్న సమక్షంలో ఒప్పుకున్న విషయం తెలిసిందే.

Update: 2023-06-24 11:13 GMT

దిశ, తాడ్వాయి : మహిళా సంఘాల సభ్యుల డబ్బులు రూ.36లక్షలను వీఓఏ బాబాగౌడ్ పక్కదారి పట్టించి తన కుటుంబ సభ్యుల వ్యక్తి గత ఖాతాకు మల్లించి వాటిని వాడుకున్నట్లు పీడీ సాయన్న సమక్షంలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం మరోమారు నందివాడ గ్రామంలో పీడీ సాయన్న మహిళా సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. దింతో వీఓఏ బాబాగౌడ్ ను రప్పించాలని అందరి సమక్షంలో డబ్బులు కడుతనని ఒప్పంద పత్రం పై సంతకం పెట్టాలని పీడీ సాయన్నను కోరారు.

కానీ బాబాగౌడ్ నందివాడ గ్రామంలో లేకపోవడంతో అతనికి ఫోన్ చేసిన బుజ్జగించి మాట్లాడి రెండున్నర గంటల సమయం ఇచ్చినప్పటికి ఎంతకు రాకపోవడంతో పీడీ సాయన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఆగ్రహించిన మహిళా సంఘాల సభ్యులు అందరు కలిసి శనివారం వీఓఏ బాబాగౌడ్ ఇంటి ముందు బైటాయించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా డబ్బులు ఖాతాలో జమ చేసేంత వరకు ఇంటిముందు నుంచి వెళ్ళేది లేదని కరాకండిగా చెప్తున్నారు.

Tags:    

Similar News